Thu Mar 19 2026 12:55:25 GMT+0530 (India Standard Time)
Telangana : మరో ఐదు రోజుల పాటు వర్షాలేనట
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిస అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాయుగుండం....
అయితే వాయుగుండం రానున్న పన్నెండు గంటల్లో బలహీనపడుతుందని, అయినా ఐదు రోజుల పాటు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నాలుగు రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో ఐదు రోజులు వర్షం పడుతుందన్న వాతావరణ శాఖ సూచనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story

